Pranab Nanda: ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. గుండెపోటుతో మృతి చెందిన గోవా డీజీపీ

  • తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిన ప్రణబ్ నందా
  • నందా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
  • ఈ ఏడాది మార్చ్ లో గోవా డీజీపీగా బాధ్యతల స్వీకరణ

ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణంగా గోవా డీజీపీ ప్రణబ్ నందా మృతి చెందారు. ఈ విషయాన్ని ఐజీ జస్పాల్ సింత్ ప్రకటించారు. నందా హఠాన్మరణం షాక్ కు గురి చేసిందని ఆయన అన్నారు. అధికారిక పర్యటనపై ప్రణబ్ నందా ఢిల్లీ వెళ్లారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు.

ప్రణబ్ నందా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్ (ఏజీఎంయూటీ)కి చెందిన ఆఫీసర్. ఈ ఏడాది మార్చ్ లో గోవా డీజీపీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారిణే. పుదుచ్చేరి డీజీపీగా ఆమె పని చేశారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించక ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆమె సేవలందించారు.

Pranab Nanda
Goa DGP
  • Loading...

More Telugu News