Indore Test: తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్లా బ్యాట్స్ మెన్

  • 493/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
  • ఓపెనర్లు ఇద్దరినీ బౌల్డ్ చేసిన ఉమేశ్, ఇశాంత్
  • 327 పరుగులు వెనుకబడి ఉన్న బంగ్లాదేశ్

ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 6 వికెట్లకు 493 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తద్వారా బంగ్లాదేశ్ పై తొలి ఇన్నింగ్స్ లో 343 ఆధిక్యాన్ని స్కోర్ బోర్డుపై ఉంచింది. నిన్న ఆట ముగిసే సమయానికి 493/6 స్కోరు మీదే ఉన్నప్పటికీ భారత్ డిక్లేర్ చేయలేదు. కానీ, ఈరోజు ఆటను కొనసాగించకుండానే డిక్లేర్ చేసింది.

మరోవైపు, భారత్ పేస్ బౌలర్లు ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ల నిప్పులు చెరిగే బంతులకు బంగ్లా బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. 6 పరుగులు చేసిన ఇమ్రుల్ ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేసి బంగ్లా పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 6 పరుగులు చేసిన మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాంను ఇశాంత్ శర్మ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే బంగ్లా ఇంకా 327 పరుగులు వెనుకబడి ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News