Old age: ఓ గుడ్ న్యూస్.. వృద్ధాప్యాన్ని జాప్యం చేయడమెలాగో కనిపెట్టిన శాస్త్రవేత్తలు!

  • సింగపూర్‌లోని నన్యాంగ్ శాస్త్రవేత్తల అరుదైన పరిశోధన
  • వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకు ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతం
  • బ్యుటిరేట్ ఫ్యాటీ యాసిడ్‌ను పెంచుకోగలిగితే ముదిమి దూరం

30 ఏళ్లు దాటితే చాలు.. చాలామందికి వృద్ధాప్యం ఆలోచనలు మొదలవుతాయి. ఎప్పుడో వచ్చే దానిని గురించి తలచుకుని ఇప్పటి నుంచే కలత చెందుతుంటారు. ఎప్పటికీ యవ్వనంతో ఉండిపోతే ఎంత బాగుణ్నో అనుకుంటారు. ఇటువంటి వారందరికీ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వృద్ధాప్యాన్ని పూర్తిగా దూరం చేయడం కాదు కానీ, దానిని జాప్యం చేసేందుకు ఏం చేయాలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది.

మనిషి పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు.. జీవక్రియలు, పోషకాహారం, మనస్తత్వం, ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. ఇవి బ్యుటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్ దీర్ఘాయువుకు కారణమయ్యే ఎఫ్‌జీఎఫ్21 అనే హార్మోన్ ఉత్పత్తికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. జీవక్రియల తీరును గాడిలో పెట్టడం ద్వారా ఈ హార్మోన్‌ ఉత్పత్తయ్యేలా చూసుకుంటే వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరకుండా అడ్డుకోవచ్చని పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ పెటెర్సన్ తెలిపారు.

వయసు పెరగడం వల్ల బ్యుటిరేట్ ఉత్పత్తి తగ్గుతుందని, ఫలితంగా శరీరం దుర్బలంగా మారుతుందని పేర్కొన్నారు. తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తల ద్వారా బ్యుటిరేట్ స్థాయుల్ని పెంచుకోగలిగితే వృద్ధాప్యం ఆలస్యమవుతుందని వివరించారు.

Old age
research
nanyang technological university
singapore
  • Loading...

More Telugu News