Devineni Uma: మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు: టీడీపీ నేత దేవినేని ఉమ

  • కోటిరెడ్డిని అకారణంగా అరెస్టు చేశారు
  • కోటిరెడ్డి ఏ తప్పుచేయలేదని గత ఎస్పీ చెప్పలేదా? 
  • నరసరావుపేటలో 122మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయించారన్న ఉమ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలను తిట్టిస్తూ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని పార్టీ నేత దేవినేని ఉమ విమర్శించారు. తమ పార్టీ నేత కోటిరెడ్డిని కారణం లేకుండా అరెస్టు చేశారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కోటిరెడ్డి ఏ తప్పు చేయలేదని గత ఎస్పీ చేప్పలేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. నరసరావుపేటలో 122 మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. సిమెంట్ కంపెనీల నుంచి జగన్ వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. తమపై ఉన్న కోపంతో భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టొద్దన్నారు.

Devineni Uma
Telugudesam
Andhra Pradesh
Criticism against CM JAGAN
  • Loading...

More Telugu News