Nara Lokesh: ఒకరిద్దరు వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు: నారా లోకేశ్

  • వైసీపీలో చేరుతున్న వల్లభనేని వంశీ
  • స్పందించిన నారా లోకేశ్
  • ఆస్తులు కాపాడుకునేందుకు వెళుతున్నారని వ్యాఖ్యలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఇక లాంఛనమేనని తేలిపోయింది. ఈ ఉదయం ఆయన చంద్రబాబు, లోకేశ్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. ఒకరిద్దరు వ్యక్తులు వెళ్లిపోయినంత మాత్రాన టీడీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. వంశీ భూములకు సంబంధించిన సమస్యల కారణంగానే పార్టీ మారుతున్నారని వివరించారు. ఆస్తులు కాపాడుకునేందుకు వంశీ టీడీపీని వీడారని వ్యాఖ్యానించారు.

Nara Lokesh
Vallabhaneni Vamsi
YSRCP
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News