Telangana Minister Eetala Rajendher Daughter Neetha Marriage: అంగరంగ వైభవంగా ఈటల కుమార్తె వివాహం

  • సతీసమేతంగా హాజరైన సీఎం కేసీఆర్
  • వదూవరులు ఇద్దరూ డాక్టర్లే
  • అకట్టుకుంటున్న వివాహ ఆహ్వాన ప్రొమో వీడియో సాంగ్

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత వివాహం  అనూప్ తో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మల్కాజ్ గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని పూడూరు గ్రామం ఈ వేడుకకు వేదికైంది.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దంపతులు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.  కాగా, వధూవరులు ఇద్దరూ డాక్టర్లే. వీరిద్దరి వివాహానికి ఆహ్వానిస్తూ.. రూపొందించిన ప్రొమో వీడియో సాంగ్ అందరినీ అకట్టుకుంది.    

Telangana Minister Eetala Rajendher Daughter Neetha Marriage
CM KCR Family attended
State Ministers
  • Loading...

More Telugu News