Vallabhaneni Vamsi: అన్నం తినేవాళ్లు ఎవరూ వైసీపీలోకి వెళ్లరని వ్యాఖ్యానించింది ఎవరు... వంశీ కాదా?: వర్ల రామయ్య

  • ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన వంశీ
  • తాజాగా అధినాయకత్వంపై వ్యాఖ్యలు
  • పార్టీ నుంచి బహిష్కరించిన టీడీపీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొన్నిరోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను పంపినా, తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రబాబుపైనా, లోకేశ్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన వంశీని పార్టీ నుంచి బహిష్కరించారు. త్వరలోనే వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.

'గతంలో జగన్ వార్డు మెంబరుగా కూడా పనికిరాడని వ్యాఖ్యలు చేసింది ఎవరు? అన్నం తినేవాళ్లు ఎవరూ వైసీపీలోకి వెళ్లరని అన్నది ఎవరు? సాక్షి దొంగ చానల్ అని చెప్పింది ఎవరు?... వంశీ కాదా? అంటూ ప్రశ్నించారు. వంశీ గురించి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదా?' అంటూ మండిపడ్డారు.

Vallabhaneni Vamsi
Telugudesam
Varla Ramaiah
Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
  • Loading...

More Telugu News