Vallabhaneni Vamsi: లోకేశ్ కు, జూనియర్ ఎన్టీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: వల్లభనేని వంశీ

  • నేను చెప్పిన దాంట్లో తప్పేముంది
  • నారా లోకేశ్ కు, జూనియర్ ఎన్టీఆర్ కు పోలికేముంది?
  • వర్థంతికి, జయంతికి తేడా తెలియని లోకేశ్ ఏం మాట్లాడగలడు?

సమర్థత విషయంలో నారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ లను పరస్పరం పోలుస్తూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై వంశీ ఘాటుగా సమాధాన మిచ్చారు.

‘నేను చెప్పిన దాంట్లో తప్పేముంది. నారా లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ కు పోలికేముంది? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని వ్యాఖ్యానించారు. లోకేశ్, ఎన్టీఆర్ లు ఒకేచోట నిలబడితే నలుగురు ఎన్టీఆర్ దగ్గరకు వస్తారా? లోకేశ్ దగ్గరకు వస్తారా? అని ప్రశ్నించారు. వర్థంతికి, జయంతికి కూడా తేడా తెలియని లోకేశ్ ఏం మాట్లాడగలడు? అని ప్రశ్నించారు.

‘లోకేశ్ ను చంద్రబాబునాయుడు గారు రుద్దుదామని ప్రయత్నం చేస్తే.. వాళ్లింట్లో రుద్దుకోగల్గుతాడు, వాళ్ల ఆస్తి ఇవ్వగల్గుతాడు, ఆ పాలూపెరుగు కంపెనీ ఇచ్చుకోగల్గుతాడు కానీ, మా మీద, ప్రజల మీద లోకేశ్ ను ఏం రుద్ద గల్గుతాడు’ అని విమర్శించారు.

Vallabhaneni Vamsi
Nara Lokesh
Junior Ntr
mla
  • Loading...

More Telugu News