TSRTC: ఆర్టీసీ కార్మికులు పెద్ద మనసుతో ఒకడుగు వెనక్కి తగ్గారు: మల్లు రవి

  • కేసీఆర్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపణ
  • సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యలు
  • ప్రజాస్వామ్యంలో చర్చలు కూడా భాగమేనని వెల్లడి

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో ముగింపు కనిపించడంలేదు. దీనిపై కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమస్య పరిష్కారం కోసం పెద్ద మనసుతో ఒకడుగు వెనక్కి తగ్గారని, ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మొండిగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు కూడా భాగమేనని, కానీ కేసీఆర్ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. చట్టం పరిధిని కూడా అతిక్రమించినట్టు అర్థమవుతోందని అన్నారు. చర్చలు జరిపి ఆ నివేదికను హైకోర్టు ముందుంచితే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 41 రోజులుగా కొనసాగుతున్నా దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమని మల్లు రవి అభిప్రాయపడ్డారు.

TSRTC
Telangana
KCR
TRS
Congress
Mallu Ravi
  • Loading...

More Telugu News