Nara Lokesh: లోకేశ్ కేమీ పనీపాటా లేదు: వల్లభనేని వంశీ

  • పనిలేకనే సోషల్ వెబ్ సైట్స్ మెయిన్టెన్ చేస్తున్నాడు
  • జనాలను భ్రమపెట్టొచ్చనుకుంటున్నాడు
  • పిచ్చి పదవుల కోసం లోకేశ్ వెనుక నేను తిరగను

టీడీపీ నేత నారా లోకేశ్ పై వల్లభనేని వంశీ మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో వంశీ మాట్లాడుతూ, లోకేశ్ కేమీ పనీపాటా లేదు కనుక సోషల్ వెబ్ సైట్స్ మెయిన్టెన్ చేస్తున్నాడని, వీటి ద్వారా రాజ్యాధికారం వస్తుందని, జనాలను భ్రమపెట్టొచ్చని, ప్రభావితం చేయొచ్చని అనుకుంటున్నాడని, ‘ఇది తప్పు’ అని హితవు పలికారు. పిచ్చి పదవుల కోసం లోకేశ్ వెనుక ఎవరైనా తిరుగుతారేమోకానీ, తన లాంటి ఎవరూ తిరగరని అన్నారు.

Nara Lokesh
Telugudesam
Vallabhaneni Vamsi
mla
  • Loading...

More Telugu News