Nara Lokesh: ఆస్తులు కాపాడుకోవడానికే వంశీ పార్టీని వీడారు.. జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ ఎందుకు?: నారా లోకేశ్

  • వంశీకి సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
  • ఓటమి భయంతో రాజీనామా చేయడం లేదు
  • జగన్ ను తిట్టి ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆస్తులను కాపాడుకోవడానికే వంశీ పార్టీని వీడారని విమర్శించారు. వంశీకి సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని అన్నారు.

మీడియాతో నిన్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనను వంశీ తీసుకురావడంపై లోకేశ్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడెందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది 2009నాటి విషయమని అన్నారు. వంశీ చెబుతున్న వెబ్ సైట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నిన్నటి వరకు జగన్ ను తిట్టిన వంశీ... ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఒత్తిడి ఉందని, తన కార్యకర్తలపై ఒత్తిడి ఉందని ఇటీవల వంశీ చెప్పారని... ఇప్పుడేమో ఇలా చేశారని అన్నారు. వంశీ పోయినంత మాత్రాన పార్టీకొచ్చే నష్టమేమీ లేదని అన్నారు.

Nara Lokesh
Vallabhaneni Vamsi
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News