Chandrababu: చంద్రబాబునాయుడు నన్ను సస్పెండ్ చేసేందేంటి, అంత సీన్ లేదు!: వల్లభనేని వంశీ

  • టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై వంశీ స్పందన
  • చంద్రబాబు ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిది
  • పార్టీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే చెప్పా

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ విషయమై స్పందించాలని కోరిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు నన్నేమి సస్పెండ్ చేస్తాడు, తన భవిష్యత్ తను చూసుకోవాలి ఫస్ట్’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిదని సూచించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన తర్వాత సస్పెండ్ చేయడమేంటన్న ప్రశ్నకు వంశీ స్పందిస్తూ, వాళ్ల పరువు వాళ్లు కాపాడుకోవడానికేనని, అన్నారు. కలిసి పనిచేయలేనని, పార్టీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు. ‘చంద్రబాబునాయుడు నన్ను సస్పెండ్ చేసేదేంటి, అంత సీన్ లేదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
Telugudesam
Vallabhaneni Vamsi
mla
  • Loading...

More Telugu News