Budda Venkanna: నేను చంద్రబాబు భక్తుడిని!: బుద్ధా వెంకన్న

  • ఎప్పటికీ టీడీపీలోనే ఉంటా
  • అవినాశ్ పార్టీ మారడం చాలా తప్పు
  • మూడు సార్లు టికెట్ ఇచ్చిన చంద్రబాబును వంశీ విమర్శించడం సరికాదు

గత ఎన్నికల్లో పరాజయం తర్వాత టీడీపీ నేతలు చాలా మంది డీలా పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ తరపున గట్టిగా గొంతుకను వినిపిస్తున్న టీడీపీ నేతల్లో బుద్ధా వెంకన్న ముందు వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి వైసీపీ కీలక నేతలందరిపై ఆయన ప్రతిరోజు ఏదో ఒక సమయంలో విమర్శలను సంధిస్తూనే ఉంటారు. తాజాగా ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను చంద్రబాబు భక్తుడినని చెప్పారు. పార్టీలో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా తాను మాత్రం ఉంటానని తెలిపారు.

దేవినేని అవినాశ్ పార్టీ మారడం చాలా తప్పు అని వెంకన్న అన్నారు. టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని అవినాశ్ ఆరోపించారని... కానీ, ఆయనకు తెలుగు యువత పదవి, గుడివాడ టికెట్ ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు. వల్లభనేని వంశీతో డ్రామా ఆడించింది వైసీపీనే అని మండిపడ్డారు. మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబును వంశీ విమర్శించడం సరికాదని అన్నారు.

Budda Venkanna
Telugudesam
Chandrababu
Devineni Avinash
Vallabhaneni Vamsi
  • Loading...

More Telugu News