Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు

  • టీడీపీ తరఫున గన్నవరం నుంచి ఎన్నికైన వంశీ   
  • నిన్న చంద్రబాబు, లోకేశ్ పై వంశీ విమర్శలు
  • సీరియస్ గా తీసుకున్న పార్టీ హైకమాండ్

తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ పై వంశీ నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాతో వంశీ మాట్లాడుతూ, తాను వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని, జగన్‌ వెంటే నడుస్తానని, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. దీనికి తోడు ఓ టీవీ ఛానల్ లో టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ను పరుష పదజాలంతో తిట్టారు. ఈ నేపథ్యంలో, వంశీ అంశాన్ని టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వంశీ అంశంపై ఈ రోజు చర్చించిన చంద్రబాబు... ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.

Vallabhaneni Vamsi
Suspension
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News