jc divakar reddy: పార్టీ మారే వారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా?: జేసీ దివాకర్ రెడ్డి

  • పార్టీ మారి వల్లభనేని వంశీ విమర్శలు చేస్తున్నారు
  • చంద్రబాబుపై సుజనా చౌదరి కూడా విమర్శలు చేశారు
  • వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదు
  • బస్సు బిజినెస్ కొంత కాలం మానేయాలని అనుకుంటున్నాను

టీడీపీపై ప్రజల్లో విశ్వాసం పోతోందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. 'పార్టీ మారే వారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా? అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు' అని అన్నారు. కొన్ని నెలల క్రితం చంద్రబాబుపై సుజనా చౌదరి కూడా విమర్శలు చేశారని, వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని వ్యాఖ్యానించారు.
 
విజయవాడలో జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ప్రతీకార కోరిక ఎక్కువైందని అన్నారు. ప్రత్యర్థులను హింసిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వారు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్లే అధికారులు కొందరిని వేధిస్తున్నారని, తాను బస్సు బిజినెస్ కొంత కాలం మానేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

jc divakar reddy
Telugudesam
Vallabhaneni Vamsi
YSRCP
  • Loading...

More Telugu News