Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ ఒవైసీపై కేసు పెట్టిన హిందూ సంస్థ

  • కేసు పెట్టిన అఖండ ఆర్యవర్త నిర్మాణ సంఘ్
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో ఆరోపణ
  • ఎన్ఐఏ చట్టం కింద అభియోగాలను నమోదు చేయాలని డిమాండ్

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై యూపీలోని అఖండ ఆర్యవర్త నిర్మాణ సంఘ్ అనే హిందూ సంస్థ కేసు పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

దేశంలో మతసామరస్యం దెబ్బతినేలా ఒవైసీ, సాంబాల్ ఎంపీ సాఖి ఉర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు మానవతకే కాకుండా, దేశ ఐక్యతకు కూడా విఘాతం కలిగిస్తాయని సంఘ్ అధ్యక్షుడు భూపేశ్ శర్మ అన్నారు. వీరిద్దరిపై ఎన్ఐఏ చట్టం కింద అభియోగాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 11న పవన్ కుమార్ అనే అడ్వొకేట్ కూడా ఒవైసీపై ఇదే తరహా ఫిర్యాదు చేశారు.

Asaduddin Owaisi
AIMIM
Case
Ayodhya
  • Loading...

More Telugu News