Vijayawada: సముద్రంలో కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళలను కాపాడిన మాజీ సర్పంచ్

  • హంసలదీవి వద్ద సాగర తీరంలో ఘటన
  • నిర్దేశిత ప్రదేశాన్ని దాటి సముద్రంలోకి 
  • రక్షించిన మాజీ సర్పంచ్ సముద్రాలు

సముద్ర తీరంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ అందులో కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళల ప్రాణాలను మాజీ సర్పంచ్ ఒకరు కాపాడారు. గురువారం సాయంత్రం హంసలదీవి వద్ద సాగరతీరంలో జరిగిందీ ఘటన. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సాగర సంగమ తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

గురువారం విజయవాడ నుంచి ఓ కుటుంబం సాగర తీరానికి చేరుకుంది. ఆ కుటుంబంలోని ముగ్గురు మహిళలు విజయదుర్గ, గౌరి, లక్ష్మిలు నిర్దేశిత ప్రదేశాన్ని దాటి సముద్రంలోకి వెళ్లి స్నానాలు చేస్తూ కొట్టుకుపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ కొక్కిలిగడ్డ సముద్రాలు వెంటనే సముద్రంలోకి దూకి కొట్టుకుపోతున్న ముగ్గురు మహిళలను రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారు సముద్రాలుకు కృతజ్ఞతలు తెలిపారు.

Vijayawada
Hamsaladeevi
sea shore
Andhra Pradesh
  • Loading...

More Telugu News