Delhi JNU: ఢిల్లీ జేఎన్ యూలో స్వామి వివేకానంద విగ్రహం ధ్వంసం

  • అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహం
  • బుధవారం వీసీపై అభ్యంతకర వ్యాఖ్యలు రాసిన  కొందరు విద్యార్థులు
  • మరుసటి రోజే విగ్రహం ధ్వంసం ఘటనతో అధికారుల్లో ఆందోళన

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ లో స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ విగ్రహం వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి ఎదురుగా ఉంది. ఇటీవల హాస్టల్ ఫీజు పెంపు, డ్రెస్ కోడ్ తదితర అంశాలను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అధికారులు పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, బుధవారం కొందరు విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనంలోకి ప్రవేశించి వీసీ మామిడాల జగదీష్ కుమార్ పై అభ్యంతరకర కామెంట్లు రాసిన మరుసటిరోజే విగ్రహం ధ్వంసం ఘటన చోటుచేసుకోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Delhi JNU
Vivekananda statue deface
Students Agitation Against VC
  • Loading...

More Telugu News