YSRCP: వైసీపీ ప్రభుత్వానికి నా మద్దతు తెలియజేస్తున్నా.. జగన్ తో కలిసి నడుస్తా: వల్లభనేని వంశీ

  • జగన్ చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తా
  • ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తప్పులు జరుగుతాయి
  • మా హయాంలో కూడా తప్పులు జరిగాయి

వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, సీఎం జగన్ తో కలిసి నడుస్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తప్పులు జరుగుతాయని, తమ హయాంలో కూడా జరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని, ఈ విషయాన్నిజగన్ దృష్టికి తీసుకెళ్లానని, వాటిని సరిచేస్తానని తనకు చెప్పారని తెలిపారు.

YSRCP
jagan
Telugudesam
Vallabhaneni Vamsi
  • Loading...

More Telugu News