YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్

  • అవినాశ్ కు వైసీపీ కండువా కప్పిన జగన్
  • పార్టీలోకి అవినాశ్ ను సాదరంగా ఆహ్వానించిన జగన్
  • అవినాశ్ తో పాటు వైసీపీలో చేరిన కడియాల బుచ్చిబాబు 

టీడీపీ నేత అవినాశ్ ఆ పార్టీని వీడారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఈరోజు సాయంత్రం ఆ పార్టీలో చేరారు. అవినాశ్ కు వైసీపీ కండువా కప్పిన జగన్, పార్టీలోకి ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. అవినాశ్ తో పాటు కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీలో చేరారు. అనంతరం, మీడియాతో అవినాశ్ మాట్లాడుతూ, పదవులు ఆశించి వైసీపీలోకి రాలేదని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలన్న ఒక నిర్ణయంతో పార్టీ మారానని చెప్పారు. పార్టీ కోసం పని చేస్తానని, ప్రజల కోసం కష్టపడతానని చెప్పారు. రాబోయే కాలంలో కూడా మళ్లీ సీఎంగా జగన్ ఉండేలా పాటుపడతామని పేర్కొన్నారు.

YSRCP
Jagan
Telugudesam
Devineni Avinash
  • Loading...

More Telugu News