Kodandaram: రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో, అచ్చెన్నాయుడు విజయవాడలో ఉండటానికి కారణం ఇదే: కొడాలి నాని
- ఇంగ్లీష్ మీడియంపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు
- ఇంగ్లీష్ రాకపోవడం వల్లే అచ్చెన్నాయుడు విజయవాడలో తిరుగుతున్నారు
- తెలుగు భాషను నిర్లక్ష్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు
ఇంగ్లీష్ మీడియంపై కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. విపక్ష నేతలు తమ పిల్లలను ఇంగ్లీష్ లో చదివిస్తూ... పేదల విషయంలో మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టే ఢిల్లీకి వెళ్లారని, అచ్చెన్నాయుడికి ఇంగ్లీష్ రాకపోవడంతో విజయవాడలోనే తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడిని చూస్తే అందరికీ భయమని చెప్పారు.
నేటి తరం పిల్లలకు ముఖ్యమంత్రి జగన్ మేనమామ వంటివారని కొడాలి నాని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 33 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. అందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుబాటులోకి రావాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని... తెలుగు భాషను నిర్లక్ష్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని చెప్పారు.