Andhra Pradesh: మాతృభాషను చంపేసే సీఎంను జగన్నే చూస్తున్నాం: కన్నా లక్ష్మీనారాయణ

  • ‘ఇంగ్లీషు’పై ప్రేమ ఉంటే ప్రత్యేక పాఠశాలలు పెట్టుకోవాలి
  • మాతృభాషను చంపొద్దు
  • ‘ఇంగ్లీషు’ను నిర్బంధ విద్యగా చేయొద్దు

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోమారు విమర్శలు చేశారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియంతలా పాలిస్తున్న జగన్, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంగ్లీషు మీడియంలో బోధన అంశంపై ఆయన విమర్శలు చేశారు.

మాతృభాషను చంపేసే సీఎంను జగన్నే చూస్తున్నామని మండిపడ్డారు. ఇంగ్లీషు భాషపై అంత ప్రేమ ఉంటే, ప్రత్యేక పాఠశాలలు పెట్టుకోవాలని, ‘ఇంగ్లీషు’ వద్దని ఎవరూ చెప్పలేదని, మాతృభాషను చంపొద్దంటున్నామని అన్నారు. టీడీపీ పాలనలో ఇదే అంశాన్ని జగన్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ‘ఇంగ్లీషు’ను నిర్బంధ విద్యగా చేయొద్దన్న విషయాన్ని తెలుగులో చెబుతున్నామని, ఏపీ పాలకుల్లో ‘తెలుగు’ తెలిసినవాళ్లు లేకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
bjp
Kanna
Lakshmi Narayana
  • Loading...

More Telugu News