Pawan Kalyan: మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో కాస్త చెప్పండి: వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ సూచన

  • కులాన్ని, పేరులో లేని పదాన్నీ వ్యక్తులకు ఆపాదిస్తారా అంటూ ఆగ్రహం
  • విడిపోయిన వారి జీవితాలపై వ్యాఖ్యానించడం తగదు
  • ఏ కులంలో పుట్టాలనేది మన చేతుల్లో లేదు

తనపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కులాన్ని, పేరులో లేని పదాలను తనకు ఆపాదించడం తగదని చెప్పారు. వైసీపీ నేతలు తనను ‘పవన్ నాయుడు’ అని సంబోధించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ స్పందిస్తూ ‘ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదు. కానీ ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లో ఉంటుంది’ అని అన్నారు.

  ముందు మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి అని వైసీపీ నేతలనుద్దేశించి అన్నారు. ఇతరుల వివాహం విషయం, విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటానికి మీకు ఇంగితం లేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారనే మాటను తాను ఆవేశంలో అనలేదని, ఉద్దేశపూర్వకంగానే అన్నానని పవన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ తెగ బాధపడిపోతున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు.  ‘తెలుగు భాషను అగౌరవపరిస్తే మట్టిలో కలిసిపోతారని మరోసారి చెబుతున్నా.. మా పార్టీది భాషల్ని గౌరవించే సంప్రదాయం’ అని పవన్ చెప్పారు.

Pawan Kalyan
Comments on YSRCP
criticism on YSRCP leaders
Caste- Individual lncidents
Andhra Pradesh
  • Loading...

More Telugu News