Sailaja: మా చరణ్ మాత్రం ఆ విషయంలో చాలా ఇబ్బందిపడ్డాడు: ఎస్పీ శైలజ

  • నాకు ఆ సమస్య ఎదురుకాలేదు 
  •  సొంతంగా ఎదగడంలోనే ఆనందం వుంది 
  •  ఎస్పీ చరణ్ కూడా అలా ఎప్పుడూ అనుకోలేదన్న శైలజ

తాజా ఇంటర్వ్యూలో ఎస్పీ శైలజ పాల్గొనగా, గాయకుడిగా బాలూగారి స్థాయికి దగ్గరగా ఆయన తనయుడు చరణ్ వెళ్లకపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అప్పుడు శైలజ స్పందిస్తూ .. "ఎక్కడైనా సరే .. తండ్రీకొడుకులు ఒకే రంగంలో వుంటే పోలికపెడుతూ మాట్లాడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది.

'ఏదేవైనా బాలుగారు బాలూగారేనండీ .. ఆ వాయిస్ వేరు .. వాళ్ల అబ్బాయి వాయిస్ వేరు' అనే అంటారు. ఈ తరహా కామెంట్లను మా చరణ్ ఫేస్ చేశాడు. నేను బాలూగారికి చెల్లెలిని కావడం వలన ఈ సమస్య నాకు ఎదురుకాలేదు. ఒకవేళ తమ్ముడినై వుంటే చరణ్ మాదిరిగా నేను కూడా ఇబ్బందులు పడేదానినే. నేనుగానీ .. చరణ్ గాని బాలుగారు సిఫార్స్ చేయలేదని ఎప్పుడూ అనుకోలేదు. చరణ్ కూడా నా మాదిరిగానే సొంతంగా ఎదగడంలోనే అసలైన ఆనందం ఉందని భావించే స్వభావం కలిగినవాడు" అని చెప్పుకొచ్చారు.

Sailaja
Charan
  • Loading...

More Telugu News