Devineni Uma: ఇసుకాసురుడు దేవినేని ఉమానే: వసంత కృష్ణప్రసాద్

  • ఏపీలో వేడి పుట్టిస్తున్న ఇసుక రాజకీయం
  • విజయవాడ సీపీని కలిసిన పార్థసారథి, కృష్ణప్రసాద్
  • టీడీపీ ఛార్జ్ షీట్ పై కేసు నమోదు చేయాలని విన్నపం

ఏపీలో ఇసుక కొరత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ నేతలు ఇసుకాసురులుగా మారారంటూ అధికారపక్షంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు, ఇసుక కొరతపై టీడీపీ ఛార్జ్ షీట్ ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ను వైసీపీ నేతలు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ కలిశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ తప్పుడు ఛార్జ్ షీట్ పై కేసు నమోదు చేయాలని కమిషనర్ ను కోరామని తెలిపారు. ఇసుకను తాము అక్రమంగా తరలించామని రుజువైతే తమపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. టీడీపీ నేత దేవినేని ఉమానే ఇసుకాసురుడు అంటూ వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. దేవినేని ఉమా ఇసుక దోపిడీని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఇలాంటి ఉమాను పక్కన పెట్టుకుని దీక్ష చేసిన చంద్రబాబు... దీక్ష ప్రాంగణాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు.

Devineni Uma
Vasantha Krishna Prasad
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News