guntur: గుంటూరులో కనకదుర్గమ్మ దేవాలయం కూల్చివేతపై హిందూ సంఘాల మండిపాటు!

  • రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేసిన అధికారులు
  • నాడు చంద్రబాబు చేసిన తప్పే నేడు జగన్ చేస్తున్నారు
  • ఆయనకు పట్టిన గతే ఈయనకూ పడతుందని ధ్వజం

రోడ్డు విస్తరణలో భాగంగా ఓ ఆలయాన్ని కూల్చివేయడం పై హిందూ సంఘాలు మండిపడ్డాయి. గుంటూరు నగరంలోని కొల్లి శారద మార్కెట్ ఎదుట కనక దుర్గమ్మ ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని ఆనుకుని వెళ్తున్న రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాన్ని అధికారులు కూల్చివేశారు. బుధవారం రాత్రి కార్పొరేష న్ సిబ్బంది ప్రొక్లయిన్లు పెట్టి ఆలయాన్ని నేలమట్టం చేశారు. 


ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూ సంఘాలు ఘటనా స్థలికి చేరుకుని నిరసన తెలియజేశాయి. హిందుత్వాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పుష్కరాల సమయంలో గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఇదే తీరున వ్యవహరించారని, ఇప్పుడు జగన్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని హిందూ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాసరావు విమర్శించారు. బాబుకు పట్టిన గతే జగన్‌ కు కూడా పడుతుందని హెచ్చరించారు.

guntur
kollisarda market
kanakadurga temple
demolition
  • Loading...

More Telugu News