Telugudesam: అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, కూన రవికుమార్‌లకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు: వైసీపీ

  • స్పీకర్ స్థానానికి భంగం కలిగేలా విమర్శలు
  • తమ్మినేనిపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపణ
  • త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు చెప్పిన గడికోట, మల్లాది

శాసనసభ స్పీకర్ స్థానానికి భంగం కలిగించేలా విమర్శలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, మాజీ విప్ కూన రవికుమార్‌లకు త్వరలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పంపనున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సచివాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను వీరు ముగ్గురూ అసభ్య పదజాలంతో దూషించారని, అందుకనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

Telugudesam
atchannaidu
Nara Lokesh
kuna ravi kumar
YSRCP
  • Loading...

More Telugu News