Amrapali: ఐఏఎస్ ఆమ్రపాలి కుటుంబానికి రూ. 4 లక్షలకు 1,210 గజాలు!

  • ఆమ్రపాలి తల్లి పేరిట స్థలం
  • అప్రోచ్ రోడ్ కోసం దరఖాస్తు
  • స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం

గతంలో వరంగల్ కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలి ఫ్యామిలీకి 1,210 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని, వికారాబాద్‌ జిల్లా కొత్రేపలిలో ఆమ్రపాలి తల్లి పద్మావతి పేరిట 4.27 ఎకరాల స్థలం ఉంది. అయితే, ఈ స్థలానికి చేరేందుకు అప్రోచ్ రోడ్ లేదు. అప్రోచ్‌ రోడ్డు కోసం తనకు స్థలం కావాలని ఆమె కోరగా, 1210 గజాల స్థలాన్ని రూ. 4 లక్షలకు కేటాయిస్తూ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Amrapali
IAS
Land
Aproch Road
  • Loading...

More Telugu News