Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ముద్దు' ప్రసక్తే లేదంటున్న తమన్నా!
  • ఎన్టీఆర్, చరణ్ లపై మాస్ సాంగ్ 
  • గుహన్ తో కల్యాణ్ రామ్ మరోసారి  

   *  ముద్దు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెబుతోంది అందాలభామ తమన్నా. 'కెరీర్ మొదట్లోనే ముద్దు సీన్లు చేయకూడదని రూల్ పెట్టుకున్నాను. అది నా కాంట్రాక్టులో కచ్చితంగా వుంటుంది. ఇప్పటికీ దానిని పాటిస్తున్నాను. ఇక ముందు కూడా తెరపై ముద్దు సీన్లు చేయను' అని తెగేసి చెప్పింది తమన్నా.  
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వీరిద్దరిపైనా ఓ జానపద బాణీతో కూడిన మాస్ పాటను త్వరలో అక్కడ చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
*  సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఆమధ్య '118'  చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. అది కల్యాణ్ రామ్ కి విజయాన్ని కూడా అందించింది. ఈ నేపథ్యంలో గుహన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయడానికి ఆయన సమాయత్తమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. 

Thamanna
NTR
Charan
Rajamouli
Kalyan Ram
  • Loading...

More Telugu News