Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

  • బలంగా ఢీకొన్న బస్సు, టెంపో
  • ఘటనలో మరో 12 మంది గాయాలు
  • మరికొందరి పరిస్థితి విషమం

రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌లోని సికర్‌లో జరిగిందీ ఘటన. టెంపో వాహనం, బస్సు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. టెంపో నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు బస్సు, టెంపోలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 12 మందిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.

Rajasthan
Road Accident
bus
tempo
  • Loading...

More Telugu News