Chandrababu: ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న చంద్రబాబు ‘ఇసుక దీక్ష’

  • విజయవాడ ధర్నాచౌక్‌లో దీక్ష ప్రారంభం
  • ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్
  • ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ఆహ్వానం

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 8 గంటలకు ‘ఇసుక దీక్ష’ ప్రారంభించనున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్‌కు సమీపంలోని ధర్నాచౌక్‌లో ప్రారంభం కానున్న చంద్రబాబు నిరాహార దీక్ష రాత్రి ఎనిమిది గంటలకు ముగియనుంది.

 ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌తో చంద్రబాబు ఈ దీక్షకు దిగారు.

దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలతోపాటు, 125 వృత్తులకు సంబంధించిన సంఘాల ప్రతినిధులను దీక్షకు ఆహ్వానించారు. ఇసుక కొరతతో నష్టపోయిన వ్యాపార రంగాల ప్రతినిధులనూ పార్టీ ఆహ్వానించింది.  

Chandrababu
Vijayawada
Andhra Pradesh
Sand
  • Loading...

More Telugu News