Smtrthi Mandhana: 'పదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డా'నన్న క్రికెటర్ స్మృతి మంధాన

  • హృతిక్ రోషన్ పై మనసుపడ్డా
  • మీరు ఒంటరిగా ఉన్నారా అన్న ప్రశ్నకు ‘బహుశా’ అంటూ జవాబు
  • సోషల్ మీడియాలో స్మృతి పోస్ట్ లు

మీరు ఎవరి ప్రేమలోనైనా పడ్డారా? అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కొంటెగా సమాధానమిచ్చింది. చిన్నవయసులోనే ప్రపంచస్థాయిలో రికార్డులు నెలకొల్పిన మంధాన వన్డేల్లో అత్యధిక వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా నిలిచింది. పురుష క్రికెటర్లతో పోలిస్తే.. శిఖర్ ధావన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

ఇటీవల సామాజిక మాధ్యమంగా ఓ అభిమాని ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడిందా? అన్న విషయంపై ఆరా తీశాడు. మీరు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారా? అని ప్రశ్నించగా, మంధాన ఉహూ..బహుశా అని బదులిచ్చింది. ఎవరిపైనా అయినా ప్రేమను పెంచుకున్నారా? అని అడగ్గా ‘నా పదేళ్ల వయసు నుంచి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పై ప్రేమను పెంచుకున్నాను’ అని పేర్కొంది.

Smtrthi Mandhana
Women cricketer
India
Social Media
I am Alone
  • Loading...

More Telugu News