centenarian couple passes away: మరణంలోనూ వీడని బంధం.. తనువులు చాలించిన శతాధిక దంపతులు!

  • వెట్రివెల్ (104 ఏళ్లు), పిచాయ్ (100 ఏళ్లు)
  • 80 ఏళ్లుగా కొనసాగుతున్న దాంపత్యం
  • భర్త మృతదేహం వద్ద ఏడుస్తూ భార్య మరణం

తమిళనాడులో శతాధిక వృద్ధ దంపతులు ఒకేరోజు తనువు చాలించారు. భర్త మరణం తట్టుకోలేని భార్య కూడా మృతదేహం వద్దే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. తమిళనాడులోని అలంగుడి తాలూకాలోని కుప్పకుడి గ్రామానికి చెందిన వెట్రివెల్(104), పిచాయి(100) దంపతులు 80 ఏళ్ల దాంపత్యాన్ని అనుభవించారు. సోమవారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తోందని భర్త వెట్రివెల్ చెప్పగా కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆయన చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.

వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత భార్య పిచాయ్ కన్నీరు మున్నీరైంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూండగానే పిచాయ్ తన భర్త మృతదేహం వద్ద విలపిస్తూ పడిపోయింది. కుటుంబ సభ్యులు వైద్యుడిని పిలిపించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యుడు వారికి తెలిపాడు. వెట్రివల్,పిచాయ్ దంపతులు కొడుకులు, మనవలు, మనవరాళ్లతో కలిసి కుప్పకుడి గ్రామంలో తమ పూర్వీకుల ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు.

centenarian couple passes away
Tamil Nadu
Kuppakudi village
  • Loading...

More Telugu News