Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు... సమాచారహక్కు చట్టం పరిధిలోకి సీజేఐ!
- ఆర్టీఐ పరిధిలో సీజేఐ కార్యాలయం
- ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్య
అయోధ్య కేసుల తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచార హక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన కార్యాలయాన్ని తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించింది. సీజేఐ, ఆయన కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు 2010లో వెలువరించిన తీర్పును సమర్థించింది. సమాచార హక్కు, గోప్యత హక్కు నాణేనికి రెండు ముఖాల వంటివని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.