High Court: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఏర్పాటు సాధ్యం కాదు: తెలంగాణ ప్రభుత్వం

  • హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం
  • రూట్ల ప్రైవేటీకరణపై కొనసాగనున్న విచారణ
  • పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని వెల్లడి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన  కమిటీ ఏర్పాటు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.  పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని కోర్టుకు తెలిపింది. మంగళవారం సమ్మెపై విచారణ కొనసాగించిన హైకోర్టు సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. కాగా, అర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది.

High Court
Telangana Government Affidavit
Ex Supreme Court Justice committee
  • Loading...

More Telugu News