budda venkanna: ఆత్మహత్యలపై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?: బుద్ధా వెంకన్న

  • దొంగ దీక్షలకు పేటెంట్ రైట్స్ వైకాపాకే ఉన్నాయి
  • ప్రజల కోసం మీరు చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా?
  • భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై మీ తీరు బాగోలేదు

దొంగ దీక్షలకు బ్రాండ్ అంబాసిడర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ ... 'దొంగ దీక్షలకు పేటెంట్ రైట్స్ వైకాపాకే ఉన్నాయి. దొంగ దీక్షల బెస్ట్ డైరెక్టర్ గా మీకు అవార్డు కూడా వచ్చింది కదా?' అని ఎద్దేవా చేశారు.

'పెద్ద రోగంతో పోయిన వాడు మా నాన్న కోసమే పోయాడు అంటూ బుగ్గలు నిమరడం, బిల్డ్ అప్ సాంగ్స్, గ్రాఫిక్స్ లో జనం, ఏసీ బస్సులో మేత అంతా బహిరంగ రహస్యమే కదా సాయి రెడ్డి గారు. మీ చరిత్రలో మీ సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా? భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

budda venkanna
Vijay Sai Reddy
YSRCP
  • Loading...

More Telugu News