Rajasekhar: యాక్సిడెంట్ పై రాజశేఖర్ కూతురు ట్వీట్

  • నాన్న ప్రమాదానికి గురైన విషయం నిజం
  • అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు
  • మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు

సినీ నటుడు రాజశేఖర్ ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాజశేఖర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై రాజశేఖర్ కుమార్తె, సినీ నటి శివాత్మిక స్పందించారు

'నాన్న ప్రమాదానికి గురైన విషయం నిజం. అయితే నాన్న అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాన్న బాగున్నారు. మీ అందరి ప్రేమకు, నాన్న త్వరగా కోలుకోవాలన్న మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు' అంటూ శివాత్మిక ట్వీట్ చేశారు.

Rajasekhar
Shivatmika
Accident
Tollywood
  • Loading...

More Telugu News