Rajashekar: సినీ హీరో రాజశేఖర్ కారుకు ప్రమాదం!

  • ఓఆర్ఆర్ పై పెద్ద గోల్కొండ వద్ద ప్రమాదం
  • 3 గంటల సమయంలో అదుపుతప్పి బోల్తా
  • ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో తప్పిన ప్రాణనష్టం

ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. శంషాబాద్ సమీపంలో అవుటర్ రింగ్ రోడ్ పై కారు వేగంగా వెళుతున్న వేళ అదుపుతప్పినట్టు సమాచారం. పెద్ద గోల్కొండ సమీపంలో కారు బోల్తా పడింది. సేఫ్టీ ఫీచర్స్ అధికంగా ఉన్న లగ్జరీ కారు కావడంతో, వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. దీంతో రాజశేఖర్ స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

Rajashekar
Hero
Car
Accident
ORR
  • Loading...

More Telugu News