tsrtc: తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

  • మహబూబాబాద్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేశ్
  • ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మనస్తాపం
  • ఈ ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య

తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోలో నరేశ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  నెల రోజులకుపైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఉద్యోగాలు పోతాయని ప్రభుత్వం హెచ్చరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఉదయం పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

tsrtc
Telangana
Mahabubabad District
suicide
driver
  • Loading...

More Telugu News