Oman: మస్కట్‌లో విషాదం.. భూగర్భంలో చిక్కుకుని ఆరుగురు భారత కార్మికుల మృతి

  • నీటి పారుదల ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు
  • భారీ వర్షాలకు భూగర్భంలో చిక్కుకున్న కార్మికులు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాయబార కార్యాలయం

మస్కట్‌లోని ఓ నీటి పారుదల ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆరుగురు భారతీయ కార్మికులు మృతి చెందారు. ఈ మేరకు భారత దౌత్య కార్యాలయం ప్రకటన చేసింది. సీబ్ ప్రాంతంలోని ఓ నీటి పారుదల ప్రాజెక్టులో వీరంతా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా కార్మికులు భూగర్భంలో చిక్కుకుని మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. లోతైన భూగర్భంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

కార్మికుల మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్న అధికారులు, మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News