Bolly wood Actress: సరదాగా చెబితే ఇంత రాద్ధాంతమా?: బాలీవుడ్ నటి స్వరభాస్కర్

  • ఓ చిన్నారి  ఆంటీ అని పిలిచాడని ఆగ్రహించిన నటి
  • స్వర ఆంటీ హ్యాష్‌టాగ్‌తో నెటిజన్ల విమర్శలు
  • నిజంగా ఆంటీవనిపించుకున్నావంటూ కామెంట్లు

తనను అంటీ అని పిలిచిన బాలుడిని తిట్టినట్లు చెప్పిన బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తాజాగా మాట మార్చింది. సరదాగా ఆ బాలుడిపై అన్న మాటలను అభిమానులతో పంచుకున్నానంటూ పేర్కొంది. సరదాగా చెప్పిన దానిపై ఇంత రాద్ధాంతం చేస్తున్నారెందుకో అని ఆమె వ్యాఖ్యానించింది. తాను చిన్న పిల్లలను మాటవరసకు కూడా ఎప్పుడూ తిట్టలేదని పేర్కొంది. ఓ కామెడీ టాక్ షోకు హాజరైన స్వరభాస్కర్ మాట్లాడుతూ.. తాను పాల్గొన్న తొలి షూటింగ్‌లో ఓ చిన్నారి తనను ఆంటీ అని పిలిచాడని, దీంతో చిర్రెత్తుకొచ్చి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డానని చెప్పింది.

దీంతో చిన్నారిని అంతంత మాటలు అనడం తగదంటూ స్వర భాస్కర్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. నీవు చేసిన ఈ పనితో నిజంగానే ఆంటీవని అనిపించుకున్నావంటూ స్వర ఆంటీ హ్యాష్‌టాగ్‌తో సందేశాలు పెట్టారు. దీంతో ఆందోళనకు గురైన నటి తాజాగా వివరణ ఇచ్చింది. కాగా, చిన్నారిపై దుర్భాషలాడిన నటిపై లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Bolly wood Actress
Swara Bhasker
called as Aunty
Angry Against boy
  • Loading...

More Telugu News