Nara Lokesh: మెదడు అరికాల్లో ఉన్న మంత్రులు ఇచ్చే పిచ్చి స్టేట్ మెంట్లు విన్న తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారు?: నారా లోకేశ్

  • అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగిన సింగపూర్ ప్రభుత్వం
  • లోకేశ్ విమర్శలు
  • జగన్ పాలనలో అమరావతి మరుగున పడిందని ఆవేదన

అమరావతి నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం వైదొలగడం పట్ల టీడీపీ అధినాయకత్వం విచారం వ్యక్తం చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదని మెదడు అరికాల్లో ఉన్న మంత్రులు పిచ్చి స్టేట్ మెంట్లు ఇచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్నినెలల కిందట అమరావతి పేరు మార్మోగిపోయిందని, కానీ జగన్ గారి పాలన మొదలయ్యాక అమరావతి మరుగున పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేపడుతున్న మిషన్ బిల్డ్ ఏపీ పథకం 'మిషన్ ఎండ్ ఏపీ' అని సింగపూర్ ప్రభుత్వానికి అర్థమైందని, అందుకే అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేసుకుందని వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధికి ఎంతో సహకరించిన సింగపూర్ సర్కారు అర్థంతరంగా వెళ్లిపోవాల్సి రావడం ప్రభుత్వ చేతగాని పనితీరుకు నిదర్శనం అని విమర్శించారు.

Nara Lokesh
Amaravathi
Singapore
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News