Pure oxygen sale in Delhi: ఢిల్లీలో 'గాలి'ని కూడా అమ్మేస్తున్నారు!

  • ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ‘ఆక్సిప్యూర్’ అనే బార్ గాలితో వ్యాపారం  
  • 15 నిమిషాలు పీల్చడానికి రూ.299ధర
  • పుదీనా, లావెండర్ వంటి సువాసనలు జోడింపు

కోరలు చాస్తోన్న వాయు కాలుష్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ కాలుష్యపోటుకు భారత్ కూడా గురైంది. వాయు కాలుష్యం బారినుంచి ప్రజలను రక్షించడానికి  ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ, అవి ఏమాత్రం ఉపశమనం కలిగించడంలేదు. ఈ నేపథ్యంలో దేశంలో 'స్వచ్ఛమైన గాలి' అంటూ అమ్మకాలు కూడా మొదలయ్యాయి.

తాజాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరడంతో ప్రజలు స్వచ్ఛమైన
ఆక్సిజన్ కోసం అర్రులు చాస్తున్నారు. దీన్ని వ్యాపారస్థులు సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ‘ఆక్సిప్యూర్’ అనే బార్ స్వచ్ఛమైన గాలిని అమ్మకాన్ని ప్రారంభించింది. 15 నిమిషాల పాటు ఆక్సిజన్ పీల్చితే రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఈ గాలిని పలు రకాలైన సువాసనలతో అందించడం ఈ బార్ ప్రత్యేకత. లెమన్ గ్రాస్, ఆరెంజ్, సిన్నా మన్, పుదీనా, యూకలిప్టస్, లావెండర్, చెర్రీ, వింటర్ గ్రీన్, తదితర ఫ్లేవర్లలో గాలిని కొనుక్కొనే వెసులు బాటును ఈ బార్ వినియోగదారులకు కల్పించింది.

Pure oxygen sale in Delhi
15 minutes Inhaling cost Rs299
  • Loading...

More Telugu News