RRR movie: రామోజీ ఫిలింసిటీలో ఉదయం షూటింగ్ ఎంతో ఆహ్లాదం: రామ్ చరణ్

  • రామోజీ ఫిలిం సిటీలో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్
  • ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉందన్న చరణ్
  • లవ్ యూ అంటూ షూటింగ్ విశేషాలను పంచుకున్న చెర్రీ

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం సినిమా టీం విదేశాలకు వెళ్లివచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ విశేషాలను హీరో రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

‘రామోజీ ఫిల్మ్ సిటీకి ఉదయం షూటింగ్ లకు రావడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఉదయం పూట జరిగే షూటింగ్ లను నేను ఎంతో ఇష్టపడతాను. లవ్ యూ’ అని పేర్కొన్నారు.

ఇందులో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా 2020 జులై 30న విడుదల చేస్తారని సమాచారం.

RRR movie
Ramoji Film City Shooting
Heroes RamCharan - NTR
  • Loading...

More Telugu News