Pizza Eating Earmning Money: పిజ్జా తింటే డబ్బులొస్తున్నాయి.. ఇక ఉద్యోగం ఎందుకంటూ రాజీనామా చేసిన బ్రిటన్ యువతి!

  • రోజంతా పిజ్జాలు తింటూ యూట్యూబ్ వీడియోల రూపకల్పన
  • రోజూ 40 వేలకు పైగా వ్యూస్
  • తిండితో పాప్యులారిటీ పెంచుకుంటూ ఆదాయం గడిస్తున్న యువతి 

యూట్యూబ్ లో తన వీడియోలకు వస్తున్న పాప్యులారిటీకి మురిసిపోయిన ఓ బ్రిటన్ భామ తన ఉద్యోగానికే రాజీనామా చేసింది. ఇంతకీ యూట్యూబ్ లో ఆమె పెట్టే పోస్టులు ఏమిటనుకుంటున్నారా... దినమంతా పిజ్జాలు తింటున్న వీడియోలే!

రుచికరమైన తిండి..పాప్యులారిటీ.. డబ్బు ఈ మూడు దొరుకుతుండటంతో లండన్ కు చెందిన  22 ఏళ్ల చర్నా రైలీ అనే యువతి ఉద్యోగాన్ని వదిలేసింది. పిజ్జాలు తింటూ ఇంట్లో ఉంటూ సదరు వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తోంది. ఆమె వీడియోలను ప్రతిరోజు 40 వేల మందికి పైగా చూస్తున్నారు. నెటిజన్లనుంచి వస్తోన్న ఆదరణతో చర్నారైలీ  తిండిపై మరింత రెచ్చిపోతోంది.

Pizza Eating Earmning Money
Britain woman Charna raily
Resigned Job
  • Loading...

More Telugu News