Jagan: ఇసుక సమస్యను పక్కదారి పట్టించడానికే జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • పవన్ పై జగన్ వ్యాఖ్యలు సరికాదన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • వెంకయ్యపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • ఆంగ్ల అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకోవాలని ఎద్దేవా

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక సమస్య నుంచి అందరి దృష్టి మరల్చడానికే జగన్ ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ పైనా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపైనా జగన్ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని అన్నారు.

తెలుగు భాష పట్ల వెంకయ్యనాయుడు ఎంత అనురక్తి ప్రదర్శిస్తారో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిపై జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. వెంకయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగు అధికార భాషా సంఘం తీసేసి, దాని స్థానంలో ఆంగ్ల అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Vishnu Vardhan Reddy
BJP
  • Loading...

More Telugu News