56 Years old mother Matrimonial ad: 56 ఏళ్ల మా అమ్మకు భర్త కావాలంటూ.. మోహిని అనే మహిళ ప్రకటన!

  • ట్విట్టర్లో సంచలనం రేపిన యాడ్
  • వరుడు శుద్ధ శాకాహారి అయివుండాలి
  • మా అమ్మకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఉండాలి

మోహిని అనే మహిళ తన 56 ఏళ్ల తల్లికి వరుడు కావలెను అంటూ ట్విట్టర్ లో ప్రకటన ఇచ్చి సంచలనం రేపారు.  అమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్ అభినందనలు తెలిపింది. ఇటీవల ఆస్తావర్మ తన 50ఏళ్ల తల్లికి ఇదే రీతిలో భర్త కావాలని ప్రకటన ఇచ్చారని, అది ప్రజల హృదయాలను దోచుకోవడమేకాక,  మోహిని లాంటి మహిళలకు ప్రేరణగా నిలిచిందని హర్షం వ్యక్తంచేసింది.

 ‘నా 56 ఏళ్ల తల్లికి 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వరుడు కావలెను. ఆయన శుద్ధ శాకాహారి అయివుండాలి. అదేవిధంగా ఆయనకు పొగ, మధ్యపానం సేవించే అలవాట్లు ఉండకూడదు. నా తల్లిని జీవిత భాగస్వామిగా చేసుకుని ప్రేమించే మనస్తత్వం కలిగివుండాలి. పిల్లల బాధ్యత తీసుకోవాలి’ అని మోహిని పోస్ట్ చేశారు. ఆసక్తి ఉన్నవారు చూడటంకోసం తన తల్లితో దిగిన ఫొటోను కూడా ఆమె ట్విట్టర్లో పెట్టారు.

56 Years old mother Matrimonial ad
Twitter ad
Ad given by Daughter
  • Loading...

More Telugu News