Rasi: అలా నా సినిమా ప్రయాణం మొదలైంది: సీనియర్ హీరోయిన్ రాశి

  • బాలనటిగా తొలి సినిమా'గిరఫ్తార్'
  • 14 ఏళ్లకే హీరోయిన్ ను అయ్యాను 
  •  నాకు ఎంత క్రేజ్ ఉందనేది కూడా తెలిసేది కాదన్న రాశి

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ రాశి మాట్లాడుతూ, తను నటన వైపు అడుగులు వేసిన తీరును గురించి ప్రస్తావించారు. "మా తాతగారికి సినిమా వాళ్లతో మంచి పరిచయాలున్నాయి. చిత్రపరిశ్రమతో మా నాన్నగారికి కూడా మంచి సంబంధాలు వున్నాయి. అందువలన నేను నటన వైపుకు వెళ్లాలని మా నాన్నగారు భావించేవారు. అలా బాలనటిగా హిందీలో 'గిరఫ్తార్' సినిమాలో చేశాను. ఇక హీరోయిన్ గా కూడా తొలి సినిమా హిందీలోనే చేశాను. మిథున్ చక్రవర్తి జోడీగా .. ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా కనిపించాను.

తెలుగులో బాలనటిగా చేసిన 'రావుగారిల్లు'మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత హీరోయిన్ గా 'శుభాకాంక్షలు' చేశాను. ఈ సినిమా సమయంలోనే నా పేరును విజయలక్ష్మీ నుంచి 'రాశి'గా మార్చారు. అలా 14 ఏళ్లకే హీరోయిన్ అయ్యాను. ఎంత పారితోషికం ఇస్తున్నారు? ఎంత క్రేజ్ వుంది? అనే విషయం కూడా అప్పుడు నాకు తెలిసేది కాదు. సినిమాలు చూసుకునేందుకు థియేటర్స్ కి వెళ్లినప్పుడు అభిమానులు పూలు చల్లుతుంటే మాత్రం ఆనందం కలిగేది" అని చెప్పుకొచ్చారు.

Rasi
Ali
  • Error fetching data: Network response was not ok

More Telugu News