Vijayawada: విజయవాడలో విషాదం.. లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న తలుపు.. కిందపడి మృతి చెందిన యువకుడు

  • కిందికి వచ్చేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చి బటన్ నొక్కిన యువకుడు
  • లిఫ్ట్ రాకున్నా తెరుచుకున్న తలుపు
  • గమనించకుండా అడుగుపెట్టడంతో కిందపడి మృతి

లిఫ్ట్ రాకముందే అందులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడలోని గవర్నర్‌పేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు బందరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఈ ఉదయం కిందికి దిగేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చి బటన్ నొక్కాడు. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. అయితే, అప్పటికి లిఫ్ట్ రాకపోవడంతో లోపలికి అడగుపెట్టిన వెంటనే అమాంతం కిందపడిపోయాడు. ఐదో అంతస్తు నుంచి పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada
apratment lift
Police
dead
  • Loading...

More Telugu News