Anantapur District: ఈ పెళ్లి తనకు వద్దంటూ... ఎస్పీకి ఫోన్ చేసిన యువతి!

  • కుమార్తెకు ఇష్టంలేని పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రులు
  • స్థానిక పోలీసులను అప్రమత్తం చేసిన ఎస్పీ
  • తల్లిదండ్రులకు కౌన్సెలింగ్

తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, ఈ వివాహం తనకు ఇష్టం లేదని, తనను కాపాడాలని కోరుతూ, ఓ యువతి అనంతపురం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసింది. ఆ వెంటనే స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ధర్మవరం, కొత్తపేటకు చెందిన 22 ఏళ్ల యువతికి వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఎస్పీకి ఫోన్ చేసిన ఆమె, పెళ్లిని ఎలాగైనా ఆపాలని కోరింది. దీంతో ధర్మవరం పోలీసులను ఎస్పీ అప్రమత్తం చేశారు. వారు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై తహసీల్దారు ఎదుట బైండోవర్ చేసి, అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయవద్దని హెచ్చరించి పంపారు. యువతిని అనంతపురంలోని ఉజ్వల హోమ్ కు పంపించారు.

Anantapur District
Marriage
Lady
SP
Police
  • Loading...

More Telugu News